For Money

Business News

ఈ నాలుగు షేర్లు చూడండి

మార్కెట్‌ దిగువ స్థాయిలో తంటాలు పడుతోంది. తీవ్ర అనిశ్చితి నెలకొంది. నిఫ్టికి ఇక్కడ మద్దతు అందుతుందా లేదా మరింత క్షీణిస్తుందా అన్న టెన్షన్‌ మార్కెట్‌లో నెలకొంది. ఈ నేపథ్యంలో వివిధ అనలిస్టులు ఇవాళ్టి ట్రేడింగ్‌కు నాలుగు షేర్లను సిఫారసు చేశారు. వాటిని మీ పరిశీలనకు ఇస్తున్నాం.

ఆర్‌సీఎఫ్‌
కొనాల్సిన ధర రూ. 88
టార్గెట్‌ రూ.95
స్టాప్‌ లాస్‌ రూ.84
మార్చి నెలాఖరు నుంచి ఈ షేర్‌ రూ.88పైన బ్రేకౌట్‌ ఇవ్వనుంది. వ్యాల్యూమ్‌ కూడా పెరుగుతోంది. గతంలో రూ. 110ని తాకిన ఈ షేర్‌ ఇపుడు మళ్ళీ ఆ జోన్‌లోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తోంది. గత ర్యాలీలో సాధించిన లాభాల్లో 50 శాతం కోల్పోయింది. తాజా కొనుగోళ్ళ మద్దతు లభించవచ్చు.
(అనలిస్ట్‌: మెహుల్‌ కొఠారి, ఆనంద్‌ రాఠి షేర్స్‌ అండ్‌ బ్రోకర్స్‌)

ఐటీసీ
కొనాల్సిన ధర రూ. 265
టార్గెట్‌ రూ.285
స్టాప్‌ లాస్‌ రూ.255

ఈ షేర్‌ స్వల్ప కాలిక టైమ్‌ ఫ్రేమ్‌లో బ్రేకౌట్‌ వస్తోంది. తాజాగా పెరిగే ఛాన్స్‌ ఉంది.

(అనలిస్ట్‌: మెహుల్‌ కొఠారి, ఆనంద్‌ రాఠి షేర్స్‌ అండ్‌ బ్రోకర్స్‌)

అదానీ పవర్‌
కొనాల్సిన ధర రూ. 292
టార్గెట్‌ రూ.325
స్టాప్‌ లాస్‌ రూ.277

డైలీ చార్ట్స్‌లో ఈ షేర్‌ కన్సాలిడేషన్‌ పూర్తవుతోంది. స్వల్ప, దీర్ఘకాలిక చలన సగటులకు పైనే ఈ షేర్‌ ట్రేడవుతోంది. రూ.277 పైన ఉన్నంత వరకు ఈ షేర్‌ రూ.325 టార్గెట్‌గా ముందుకు సాగే అవకాశముంది.
(అనలిస్ట్‌: రూపక్‌ డే, ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌‌)

హెచ్‌ఎఫ్‌సీఎల్‌
కొనాల్సిన ధర రూ. 67.90
టార్గెట్‌ రూ. 90
స్టాప్‌ లాస్‌ రూ. 62.90

ఈ షేర్‌ ట్రెండ్‌ రివర్సల్‌ చూపుతోంది. రూ.63పైన ఈ షేర్‌ రూ.90 టార్గెట్‌ పెరగొచ్చు.

(అనలిస్ట్‌: రూపక్‌ డే, ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌‌)