For Money

Business News

బలంగా, బలహీనంగా ఉన్న షేర్లు

మూమెంటమ్‌ను సూచించే మూవింగ్ యావరేజ్‌ కన్వర్జెన్స్‌ డైవెర్జెన్స్ (MACD)ను బట్టి చూస్తే కొన్ని షేర్లలో బుల్లిష్‌ ట్రేడ్ సెటప్ కన్పిస్తుంది. అవి.. 3ఎం ఇండియా, కేపీఐటీ టెక్నాలజీస్‌, షఫ్లర్‌ ఇండియా, లక్ష్మీ ఆర్గానిక్స్‌, లక్స్‌ ఇండస్ట్రీస్‌, కోఫోర్జ్‌ సాధారణంగా షేర్‌ లేదా సూచీలో ట్రెండ్‌ రివర్సల్‌ను MACD సూచిస్తుంది. సిగ్నల్‌ లైన్‌ను MACD దాటితే సదరు షేర్‌ పెరుగుతుంది. అదే సిగ్నల్‌ లైన్‌ దిగువకు వస్తే బేరిష్‌ ధోరణి కన్పిస్తుంది. కొన్ని షేర్లలో బేరిష్‌ ధోరణి కన్పిస్తోంది. ఆ షేర్లు… క్రిసిల్, ఐటీసీ, జీఎంఎం ఫౌడ్లర్‌, జీఈ షిప్పింగ్‌, ఈజీ ట్రిప్‌ ప్లానర్స్‌.
ఇక వాల్యూ (విలువ) పరంగా చాలా యాక్టివ్‌గా ఉన్న షేర్లలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌, అదానీ పవర్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎం అండ్‌ ఎం, జూబ్లియంట్‌ ఫుడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ముందున్నాయి. అదే వాల్యూమ్‌ (ట్రేడింగ్ పరిమాణం) ఆధారంగా చూస్తే వోడాఫోన్‌ ఐడి, జొమాటొ, సుజ్లాన్‌ ఎనర్జి, జేపీ పవర్‌, ఓఎన్‌జీసీ, అదానీ పవర్‌ముందున్నాయి.
52 వారాల గరిష్ఠ స్థాయిని దాటిన బ్లూ డార్ట్‌ షేర్‌లో కొనుగోలు ఆసక్తి కన్పిస్తోంది. అదే సుందరం ఫైనాన్స్‌, ఇప్కా ల్యాబ్స్‌ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి కన్పిస్తోంది. ఇవి 52 వారాల కనిష్ఠ స్థాయిలకు దిగువన ట్రేడవుతున్నాయి.