For Money

Business News

భారీ నష్టాలతో సింగపూర్ నిఫ్టి

రాత్రి అమెరికా మార్కెట్ల పతనానికి ఆసియా మార్కెట్లు స్పందిస్తున్నాయి. జపాన్‌ మార్కెట్‌కు ఇవాళ సెలవు. సాధారణంగా అమెరికా మార్కెట్లను పెద్దగా పట్టించుకోవు. అందుకే చైనా మార్కెట్ల నష్టాల్లో స్వల్పంగా ఉన్నాయి. న్యూజిల్యాండ్‌ రెండు శాతంపైగా నష్టపోయినా.. ఆస్ట్రేలియా మార్కెట్‌ 0.7 శాతం నష్టంతో ఉంది. ఇక చైనా మార్కెట్లలో పెద్ద మార్పు లేదు. నిజానికి చైనా A20 సూచి గ్రీన్‌లో ఉంది. అలాగే హాంగ్‌సెంగ్‌ కూడా 0.35 శాతం నష్టంతో ఉంది. ఇతర మార్కెట్లపై పెద్దగా ప్రభావం లేకున్నా… మన మార్కెట్లు తీవ్రంగా స్పందించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అమెరికాలో వచ్చే నెలలో అర శాతం మేర వడ్డీ రేట్లు పెంచడం ఖాయంగా కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లలో ముఖ్యంగా ఐటీ, టెక్‌ కంపెనీలపై ప్రభావం అధికంగా ఉంటోంది. దీనికి సింగపూర్ నిఫ్టి తీవ్రంగా స్పందిస్తోంది. తాజా సమాచారం మేరకు 190 పాయింట్లకు పైగా నష్టంతో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టి ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో నిఫ్టి కూడా నష్టాలతో ప్రారంభం కానుంది.