For Money

Business News

స్థిరంగా SGX NIFTY

శుక్రవారం అమెరికా మార్కెట్లు గ్రీన్‌లో ముగిశాయి. ప్రధానంగా నాస్‌డాక్‌ 0.95 శాతం లాభపడింది. అలాగే ఎస్‌ అండ్‌ పీ 0.25 శాతం పెరిగింది. అయితే డౌజోన్స్‌ మాత్రం 0.08 శాతం అంటే పెద్దగా మార్పు లేకుండా ముగిసింది. డాలర్‌ ఇండెక్స్‌ ఇప్పటికీ 102 దిగువనే ఉంది. దీంతో క్రూడ్‌, బులియన్‌ పటిష్ఠంగా ఉన్నాయి. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. జపాన్‌ మార్కెట్లకు సెలవు. ఇక చైనా, హాంగ్‌సెంగ్‌ మార్కెట్లు ఒకటిన్నర శాతం నుంచి రెండు శాతం లాభం వరకు ట్రేడవుతోంది. వారం రోజుల సెలవుల తరవాత ఈ మార్కెట్లు ఇవాళ ప్రారంభమయ్యాయి. తైవాన్‌ కూడా 3 శాతం లాభంతో ఉంది. అయితే సింగపూర్ నిఫ్టి మాత్రం స్థిరంగా ఉంది. రెండు రోజుల్లో బడ్జెట్‌ ఉండటం, హిండెన్‌బర్గ్‌ నివేదిక ప్రభావం అదానీ గ్రూప్‌పై కొనసాగడం మార్కెట్‌కు మైనస్‌గా కన్పిస్తోంది. ఇవాళ అదానీ గ్రూప్‌ షేర్లకు మద్దతు అందకపోతే… నిఫ్టిపై ఒత్తిడి పెరిగే అవకాశముంది.