For Money

Business News

స్థిరంగా సింగపూర్‌ నిఫ్టి

ఈనెల 20, 21 తేదీల్లో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ భేటీ కానుంది. ఈసారి వడ్డీ రేట్లను కనీసం 0.75 శాతం పెంచుతుందని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అన్ని అంశాలను అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ముందుకు సాగుతోంది. ద్రవ్యోల్బణం ఏ మాత్రం తగ్గకపోవడంతో… వడ్డీను భారీగా పెంచాలని ఫెడరల్‌ రిజర్వ్‌ నిర్ణయించింది. దీంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లన్నీ ఫెడ్‌ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. ఫెడ్‌ నిర్ణయాన్ని మార్కెట్‌ ఇప్పటికే డిస్కౌంట్‌ చేసిందా… లేదా ఇవాళ రేపు కూడా క్షీణిస్తుందా అన్నది చూడాలి. గత శుక్రవారం అమెరికా మార్కెట్లలోనష్టాలు కొనసాగాయి. కాకపోతే… భారీ నష్టాల నుంచి మార్కెట్లు స్వల్పంగా కోలుకుంది. నాస్‌డాక్‌ 0.90 శాతం నష్టపోయింది. ఇవాళ ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. జపాన్‌ మార్కెట్లకు ఇవాళ సెలవు. ఇక హాంగ్‌సెంగ్‌ 0.76 శాతం నష్టంతో ఉంది. అయితే చైనా మార్కెట్లు మాత్రం పటిష్ఠంగా ఉన్నాయి. లాభనష్టాలు ఓ మోస్తరుగా ఉన్నాయి. న్యూజిల్యాండ్‌, ఆస్ట్రేలియా వంటి మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. అయితే లాభాలు నామమాత్రమే. సింగపూర్‌ నిఫ్టి పాతిక పాయింట్ల లాభంతో ఉంది. సో… నిఫ్టి స్థరంగా ప్రారంభమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి.