For Money

Business News

స్థిరంగా సింగపూర్ నిఫ్టి

రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. టెక్‌ షేర్లతో పాటు గ్రోత్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి రావడంతో నాస్‌డాక్‌తో పాటు ఇతర సూచీలు నష్టాల్లో ముగిశాయి. నాస్‌డాక్‌ 1.25 శాతం నష్టపోగా, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.72 శాతం నష్టపోయింది. ఇక డౌజోన్స్‌ 0.5 శాతం క్షీణించింది. రాత్రి డాలర్‌ స్థిరంగా ఉంది. వృద్ధి అవకాశాలు సన్నగిల్లడంతో క్రూడ్‌ డిమాండ్‌ పడిపోతోంది. ఇపుడు బ్రెంట్ క్రూడ్‌ 93 డాలర్ల ప్రాంతంలో ట్రేడవుతోంది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు కూడా రెడ్‌లో ఉన్నాయి. జపాన్‌ నిక్కీ 0.94 శాతం నష్టపోగా, ఇతర సూచీల్లో పెద్దగా నష్టాల్లేవ్‌. హాంగ్‌సెంగ్‌ కూడా కేవలం 0.26 శాతం నష్టంతో ఉంది. తైవాన్‌ 0.74 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో సింగపూర్‌ నిఫ్టి 25 పాయింట్ల నష్టంతో ఉంది. నిఫ్టి స్థిరంగా లేదా స్వల్ప నష్టంతో ప్రారంభం కానుంది.