For Money

Business News

భారీ నష్టాలతో నిఫ్టి?

నిన్న మార్కెట్లకు సెలవు. మొన్న రాత్రి, నిన్న రాత్రి అమెరికా మార్కెట్ నష్టాలను పరిగణనలోకి తీసుకుంటే సింగపూర్‌ నిఫ్టి భారీగా నష్టపోయింది. మాంద్యం భయాలతో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు భారీగా పడ్డాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధర 103 డాలర్ల నుంచి
95 డాలర్లకు పడింది. దీంతో డౌజోన్స్‌ రాత్రి 0.88 శాతం నష్టపోయింది. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీలో 11 రంగాల సూచీలు ఉండగా… 10 రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. దీంతో ఈ సూచీ కూడా 0.7 శాతం నష్టపోయింది. ఇక నాస్‌డాక్‌ ఇది వరకే భారీ నష్టపోయినందున… రాత్రి 0.56 శాతం మేర నష్టాలకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఆసియా మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా జపాన్‌ నిక్కీ 1.72 శాతం, ఆస్ట్రేలియా 2 శాతం, తైవాన్‌ 1.85 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. హాంగ్‌సెంగ్‌ కూడా ఒక శాతం నష్టంతో ఉంది. చైనా సూచీల నష్టాలు కూడా ఒక మోస్తరుగా ఉన్నాయి.ఈ నేపథ్యంలో నిన్న సింగపూర్‌ నిఫ్టి ఒకదశలో 300 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఇవాళ మరో 46 పాయింట్ల నష్టంతో ఉంది. వెరశి 17460 వద్ద సింగపూర్‌ నిఫ్టి ట్రేడవుతోంది. నిఫ్టి క్రితం ముగింపు 17,759. మరి ఇవాళ నష్టాలతో ప్రారంభం కావడం ఖాయం. మరి నష్టాలు ఏ స్థాయిలో ఉంటాయో చూడాలి.