For Money

Business News

లాభాలతో ప్రారంభం కానున్న నిఫ్టి

నిన్న స్వల్ప లాభాలతో ముగిసిన నిఫ్టి ఇవాళ కూడా ఒక మోస్తరు లాభాలతో ప్రారంభం కానుంది. రాత్రి అమెరికా మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. క్రూడ్‌ ఆయిల్ ధరల జోరు కూడా తగ్గింది. ఉదయం నుంచి అన్ని ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. జపాన్‌ నిక్కీ 0.83 శాతం లాభంతో ఉంది. చైనా మార్కెట్లు నామ మాత్రపు లాభాల్లో ఉన్నా… హాంగ్‌సెంగ్‌ మాత్రం రికార్డు స్థాయిలో 1.72 శాతం లాభంతో ట్రేడవుతోంది.ఇతర మార్కెట్లు కూడా అర శాతం వరకు లాభంతో ట్రేడవుతున్నాయి. ఇక సింగపూర్‌ నిఫ్టి కూడా 65 పాయింట్ల లాభంతో గ్రీన్‌లో ఉంది. ఈ నేపథ్యంలో నిఫ్టి కూడా లాభాలతో ప్రారంభమయ్యే అవకాశముంది.