For Money

Business News

స్వల్ప నష్టాల్లో SGX నిఫ్టి

రాత్రి అమెరికా మార్కెట్లకు సెలవు. ఫ్యూచర్స్‌ మాత్రం గ్రీన్‌లో ఉన్నాయి. నిన్న రాత్రి యూరో మార్కెట్లు గ్రీన్‌లో ముగిశాయి. ప్రధాన సూచీలు ఒక శాతం వరకు లాభపడ్డాయి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. ఫ్యాక్టరీ ఉత్పత్తి అనూహ్యంగా తగ్గడంతో జపాన్‌ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిక్కీ స్వల్ప నష్టంతో ఉంది. అలాగే న్యూజిల్యాండ్‌, ఆస్ట్రేలియా కూడా. చైనా, హాంగ్‌ కాంగ్ మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నా… స్వల్పంగానే. మరోలా చెప్పాలంటే.. మార్కెట్లు లాభనష్టాల్లో ఉన్నా అవి నామమాత్రంగానే ఉన్నాయి. సింగపూర్ నిఫ్టి ప్రస్తుతం 44 పాయింట్ల నష్టంతో ఉంది. నిన్న మన మార్కెట్లు భారీ లాభాలతో ముగిసిన విషయం తెలిసిందే. నిఫ్టి కూడా స్వల్ప నష్టంతో లేదా స్థిరంగా ప్రారంభం కావొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్‌ ఆయిల్‌ 122 డాలర్లను దాటడం మన మార్కెట్లకు మైనస్‌.