లాభాల్లో సింగపూర్ నిఫ్టి
అంతర్జాతీయ మార్కెట్లు స్తబ్దుగా ఉన్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లు గ్రీన్లో ముగిసినా… నాస్డాక్ వినా.. ఇతర సూచీల్లో పెద్ద మార్పు లేదు. నాస్డాక్ 0.41 శాతం లాభపడగా, ఎస్ అండ్ పీ 500 సూచీ 0.29 శాతం లాభపడిండి. డౌజోన్స్ 0.18 శాతం లాభంతో ముగిసింది. అంతకుముందు యూరప్ మార్కెట్లు కూడా గ్రీన్లోముగిశాయి. రాత్రి డాలర్ స్వల్పంగా తగ్గినా.. క్రూడ్ ఆయిల్ భారీగా పెరిగింది. బ్రెంట్ క్రూడ్ 102 డాలర్లకు చేరింది. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు గ్రీన్లో ఉన్నాయి. జపాన్ 0.52 శాతం లాభంతో ఉంది. ఇతర సూచీల్లో హెచ్చుతగ్గులు నామ మాత్రంగా ఉన్నాయి. సింగపూర్ నిఫ్టి మాత్రం 81 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. సో.. నిఫ్టి గ్రీన్లో ప్రారంభం కానుంది.