For Money

Business News

నాస్‌డాక్‌ సూపర్‌ జంప్‌

రాత్రి అమెరికా స్టాక్‌ మార్కెట్లు దుమ్మురేపాయి. ఫెడరల్‌ రిజర్వ్‌ 0.75 శాతం వడ్డీ రేట్ల పెంపును మార్కెట్‌ ఇది వరకే డిస్కౌంట్‌ చేయడం.. అంతే స్థాయిలో వడ్డీ రేట్లు పెరగడంతో… రాత్రి ఈక్విటీ మార్కెట్‌ సూచీలు దౌడు తీశాయి. గత ఏప్రిల్‌ తరవాత ఒకే రోజు నాస్‌డాక్‌ నాలుగు శాతంపైగా పెరిగింది. ఆల్ఫాబెట్‌, మైక్రోసాఫ్ట్‌ ఫలితాలు సానుకూలంగా ఉండటంతో నాస్‌డాక్‌ నాలుగు శాతం లాభంతో ముగిసింది. ఇక ఎస్‌ అండ్ పీ 500 సూచీ కూడా 2.62 శాతం లాభంతో ముగిసింది. మున్ముందు భారీ స్థాయిలో వడ్డీ రేట్లు పెరిగే ఛాన్స్‌ ఉండదని.. మీటింగ్‌ మీటింగ్‌కు పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని ఫెడ్‌ఛైర్మన్‌ జెరోమ్‌ పావల్ స్పష్టం చేయడంతో డౌజోన్స్‌ కూడా 1.37 శాతం లాభంతో ముగిసింది. ఫెడ్‌ నిర్ణయం వెంటనే డాలర్‌ బలహీనపడింది. డాలర్‌ ఇండెక్స్‌ 106కు పడింది. ఇక క్రూడ్‌ కూడా భారీ పెరిగింది. బ్రెంట్ క్రూడ్‌ 103 డాలర్లను దాటింది. డాలర్‌ బలహీనపడటంతో బులియన్‌ కూడా పెరిగింది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు గ్రీన్లో ఉన్నాయి. కాని అమెరికా ఉత్సాహం లేదు. కేవలం న్యూజిలాండ్‌ సూచీ ఒక్కటే 1.5 శాతం లాభంతో ఉంది. జపాన్‌ నిక్కీ 0.09 శాతం లాభపడగా, హాంగ్‌సెంగ్‌ రెడ్‌లో ఉంది. అయితే చాలా స్వల్పంగా 0.05 శాతం నష్టంతో ఉంది. చైనా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నా నానమాత్రపు లాభాలే. ఇక సింగపూర్ నిఫ్టి 75 పాయింట్ల లాభంతో ఉంది. సో… నిఫ్టి లాభాలతో ప్రారంభం కానుంది.