సింగపూర్ నిఫ్టికి లాభాలు
రాత్రి అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. మూడు ప్రధాన సూచీలు రాత్రి గ్రీన్‌లో క్లోజయ్యాయి. డౌజోన్స్ 0.78 శాతం, ఎస్ అండ్ పీ 500 సూచీ 1.29 శాతంతో పాటు నాస్డాక్ 1.9 శాతం లాభపడింది. రాత్రి అమెరికాలో క్రూడ్ నిల్వలు అనూహ్యంగా పెరగడంతో ధరలపై ఒత్తిడి కన్పించింది. అయినా బ్రెంట్ క్రూడ్ 84 డాలర్ల ప్రాంతంలో ట్రేడవుతోంది. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. లాభనష్టాల్లో పెద్దగా తేడా లేదు. హాంగ్‌సెంగ్ కూడా 0.2 శాతం లాభానికే పరిమితమైంది. సింగపూర్ నిఫ్టి మాత్రం 70 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. సో… నిఫ్టి లాభాల్లో ప్రారంభం కానుంది.