For Money

Business News

లాభాల్లో SGX NIFTY

రాత్రి అమెరికా మార్కెట్లు ఒక మోస్తరు లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా టెక్‌ షేర్లు లాభాలతో ముగియడంతో ఎస్‌ అండ్ పీ 500 సూచీ కూడాకోలుకుంది. నాస్‌డాక్‌ 1.13 శాతం లాభపడగా, ఎస్‌ అండ్ పీ 500 సైచీ 0.75 శాతం లాభపడింది.. ఇక డౌజోన్స్ 0.55 శాతం లాభంతో ముగిసింది. డాలర్‌ స్థిరంగా ఉంది. ఇవాళ స్వల్ప నష్టాలు కన్పిస్తున్నాయి. క్రూడ్‌ ఆయిల్‌ కూడా స్థిరంగా ఉంది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నా… ప్రధాన మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ఉన్నాయి. జపాన్‌ నిక్కీ ఒక శాతంపైగా లాభంతో ట్రేడవుతుండగా తైవాన్, హాంగ్‌కాంగ్‌, కోస్పి కూడా అర శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. కొన్ని మార్కెట్లు నష్టాల్లో ఉన్నా… నామమాత్రమే. చైనా మార్కెట్లలో పెద్ద జోష్‌ లేదు. ఇక సింగపూర్ నిఫ్టి ఇవాళ 69 పాయింట్లకు పైగా లాభంతో ఉంది. సో… నిఫ్టి ఇవాళ లాభాలతో ప్రారంభం కానుంది.