For Money

Business News

18,600పైన ముగిసిన నిఫ్టి

ఉదయం అధిక స్థాయిలో అమ్మినవారికి మంచి లాభాలు వచ్చాయి. ఆరంభంలోనే నిఫ్టి 18625ను తాకి.. మిడ్‌ సెషన్‌ సమయంలో 18536 పాయింట్లను తాకింది. మిడ్‌సెషన్‌లో ప్రారంభమైన యూరో మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. ప్రధాన మార్కెట్ల సూచీలల పెద్ద మార్పు లేదు. అమెరికా ఫ్యూచర్స్‌ గ్రీన్‌లో ఉన్నా… నామమాత్రమే. మిడ్‌ సెషన్‌ తరవాత బ్యాంక్‌ నిఫ్టి నుంచి గట్టి మద్దతు అందడంతో నిఫ్టి కోలుకుని ఉదయం స్థాయికి చేరింది.18,609 వద్ద 49 పాయింట్ల లాభంతో ముగిసింది. ఇవాళ అన్ని సూచీలు సుమారు పాటి లాభాలతో క్లోజ్‌ కాగా, బ్యాంక్‌ నిఫ్టి ఒకశాతంపైగా లాభంతో ముగిసింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పీఎన్‌బీ, ఫెడరల్‌ బ్యాంక్‌,యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఆరు శాతంపైగా లాభంతో ముగిసింది. భారత్‌ ఫోర్జ్‌ 4 శాతంపైగా లాభపడింది.