స్వల్ప లాభాల్లో SGX NIFTY
రాత్రి అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఆరంభంలో మార్కెట్లు చాలా డల్‌గా ఉన్నా.. క్లోజింగ్ సమయానికి ఎకానమీ షేర్లు బాగా రాణించాయి. దీంతో డౌజోన్స్ 1.31 శాతం లాభంతో క్లోజ్ కాగా, ఎస్ అండ్ పీ సూచీ 0.96 శాతం లాభంతో ముగిసింది. నాస్డాక్ కూడా నష్టాల నుంచికోలుకుని 0.85 శాతం లాభంతో ముగిసింది. డాలర్ ఇండెక్స్ 110పై స్థిరంగా ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ కూడా 98 డాలర్ల ప్రాంతంలో ఉంది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. చైనా, హాంగ్‌సెంగ్ మార్కెట్లు నష్టాల్లో ఉండగా, మిగిలిన మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. జపాన్ నిక్కీ 1.3 శాతం లాభంతో ఉంది. చైనా మార్కెట్లు అర శాతంపైగా నష్టంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 58 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. అయితే మన మార్కెట్లకు ఇవాళ గురునానక్ జయంతి సందర్భంగా సెలవు.