స్వల్ప లాభాల్లో SGX NIFTY
రష్యా, ఉక్రెయిన్ మధ్య సాగుతున్న శాంతి చర్చల నుంచి ఎలాంటి సానుకూల ఫలితాలు రాకపోవడంతో ఈక్విటీ మార్కెట్లలో మళ్ళీ అనిశ్చితి మొదలైంది. దీనికన్నా అధిక ద్రవ్యోల్బణం అమెరికా మార్కెట్లను వణికిస్తోంది. ద్రల్యోల్బణ 40 ఏళ్ళ గరిష్ఠ స్థాయికి చేరడంతో ఫెడరల్ రిజర్వ్ అర శాతం మేర వడ్డీ రేట్లను పెంచడం ఖాయంగా కన్పిస్తోంది. జర్మనీలో పెట్రోల్ ధరలు 34 శాతం పెరగడంతో అక్కడ కూడా ద్రవ్యోల్బణ భయం మొదలైంది. దీంతో నిన్న యూరో మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. రాత్రి అమెరికా మార్కెట్లు కూడా నష్టాల్లో ముగిశాయి. అయితే నష్టాల్లో పరిమితంగానే ఉన్నాయి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లన్నీ నష్టాల్లో ఉన్నాయి. ఆస్ట్రేలియా మాత్రం గ్రీన్లో ఉంది. జపాన్ నష్టాలు నామ మాత్రమే. హాంగ్కాంగ్ సూచీ 1.33 శాతం నష్టపోయింది. చైనా మార్కెట్లు కూడా అర శాతం నష్టంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 38 పాయింట్ల లాభంతో ఉంది. అయితే మార్కెట్ స్థిరంగా లేదా స్వల్ప నష్టాలతో ప్రారంభం కావొచ్చు. ఇవాళ మార్చి నెల డెరివేటివ్స్కు క్లోజింగ్డే.