SGX NIFTY… 110 పాయింట్ల డౌన్
శుక్రవారం మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. కారణం పాజిటివ్ న్యూస్. అమెరికా జాబ్ డేటా చాలా పటిష్ఠంగా ఉంది. సాధారణంగా ఇలాంటి డేటాతో మార్కెట్ పెరగాలి. కాని శుక్రవారం అమెరికా మార్కెట్లు నష్టాలు ముగిశాయి. కారణం.. మాంద్యం రావడానికి అమెరికా ఆర్థిక వ్యవస్థ రెడీ ఉందని వార్తలు వస్తున్నా.. జాబ్ డేటా పాజిటివ్‌గా రావడంతో… వడ్డీ రేట్లు అధికంగా పెరుగుతాయని సంకేతాలు వస్తున్నాయి. దీంతో వాల్‌స్ట్రీట్ నష్టాల్లో ముగిశాయి. నాస్‌డాక్ స్థిరంగా ముగిసినా. మిగిలిన సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి. అయితే ఇవాళ ఉదయం నుంచి అమెరికా ఫ్యూచర్స్ అరశాతం పైగా నష్టపోయాయి. ఆసియా మార్కెట్లన్నీ నష్టాల్లో ఉన్నాయి. ముఖ్యంగా చైనా, హాంగ్‌కాంగ్ భారీగా నష్టంతో ఉన్నాయి. 1.5 శాతం నుంచి 2.5 శాతం వరకు నష్టాల్లో ఉన్నాయి. ఒక్క జపాన్ నిక్కీ మాత్రమే 0.8 శాతం నష్టంతో ఉంది. అయితే హాంగ్‌సెంగ్ సూచీ 2.46 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 110 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. సో.. నిఫ్టి నష్టాల్లో ప్రారంభం కావడం తథ్యంగా కన్పిస్తోంది.