For Money

Business News

డీమార్ట్‌ ఫలితాలు సూపర్‌

డీమార్ట్‌ స్టోర్ల నిర్వహిస్తున్న ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన తొలి త్రైమాసికంలో నికర లాభం ఆరు రెట్లు పెరిగి రూ. 643 కోట్లకు చేరింది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభం కేవలం రూ. 95 కోట్లు మాత్రేమ. మొత్తం ఆదాయం కూడా 94 శాతం పెరిగి రూ. 10,038 కోట్లకి చేరింది. గతేడాది తొలి త్రైమాసికంలో అమ్మకాలు రూ. 5,183 కోట్లు మాత్రమే. అలాగే మొత్తం వ్యయాలు 81 శాతం పెరిగి రూ. 9,192 కోట్లకు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. గత మూడేళ్లలో కంపెనీ 110 స్టోర్లను కొత్తగా ఏర్పాటు చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఈకామర్స్‌ బిజినెస్‌ 12 నగరాలకు విస్తరించగా, ఇకపై మరిన్ని నగరాలలో ఈకామర్స్‌ సేవలు విస్తరించనున్నట్లు కంపెనీ పేర్కొంది.