ఫ్యూచర్ రిటైల్: రిలయన్స్‌కు షాక్
ఫ్యూచర్ రిటైల్ (ఎఫ్ఆర్ఎల్) ఆస్తులను రిలయన్స్ రిటైల్‌కు విక్రయించేందుకు ప్రతిపాదించిన లావాదేవీని సెక్యూర్డ్ రుణదాతలు తిరస్కరించారు. ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్‌కు రూ. 24,713 కోట్లకు ఫ్యూచర్ రిటైల్‌ను విక్రయించేందుకు కిషోర్ బియాని నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్ గతంలోనే ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ లావాదేవీపై జరిగిన ఓటింగ్‌లో షేర్హోల్డర్లు, అన్సెక్యూర్డ్ రుణదాతల్లో 75 శాతం ఆమోదించారని, 69.29 శాతం మెజారిటీ సెక్యూర్డ్ రుణదాతలు తిరస్కరించారని ఫ్యూచర్ రీటైల్ స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. ఈ లావాదేవీ పూర్తికావడానికి 75 శాతం సెక్యూర్డ్ రుణదాతలు అనుమతించడం అవసరం. డీల్‌కు 85.94 శాతం మంది షేర్హోల్డర్లు ఆమోదం తెలిపారని కంపెనీ వెల్లడించింది. ఇప్పటికే ఈ లావాదేవీని వ్యతిరేకిస్తూ అంతర్జాతీయ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కోర్టుల్లో పోరాటం జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇపుడు ప్రధాన బ్యాంకులు ఈ డీల్‌ను వ్యతిరేకించడంతో రిలయన్స్ డీల్ విఫలమైనట్లే. దివాలా ప్రక్రియ ద్వారానే ఫ్యూచర్స్ సమస్య తేలే అవకాశముంది. తన ఖాతాల్లోఉన్న రూ. 12000 కోట్ల రుణాన్ని రిలయన్స్‌కు బదిలీ చేయడాన్నిబ్యాంకులు అంగీకరించడం లేదు.