For Money

Business News

అంచనాలకు మించిన ఫలితాలు

డిసెంబర్‌ నెలతో ముగిసిన మూడు నెలల కాలంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ మార్కెట్‌ అంచనాలకు మించి చక్కటి పనితీరు కనబర్చింది. గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే బ్యాంక్‌ నికర లాభం 59.4 శాతం పెరిగి రూ. 6450 కోట్ల నుంచి రూ. 7018 కోట్లకు చేరింది. అనేక బిజినెస్‌ న్యూస్‌ ఛానల్స్‌ బ్యాంక్‌ ఈ త్రైమాసికంలో రూ. 6629 కోట్ల నికర లాభం ప్రకటిస్తుందని అంచనా వేశారు. అలాగే బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం (Net Interest Income) కూడా 20.8 శాతం పెరిగి రూ. 12605 కోట్లకు చేరింది. మార్కెట్‌ వర్గాలు రూ. 12621 కోట్ల NIIని అంచనా వేశాయి. వాటాదారులకు ఒక్కో షేర్‌కు రూ. 5 డివిడెండ్ ఇవ్వాలని కంపెని బోర్డు ప్రతిపాదించింది.