సెంబ్‌కార్ప్ చేతికి వెక్టర్ గ్రీన్ ఎనర్జీ
సింగపూర్ కేంద్రంగా పనిచేసే సెంబ్‌కార్ప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తాజాగా వెక్టర్ గ్రీన్ ఎనర్జీ కంపెనీని రూ.2,780 కోట్లకు కొనుగోలు చేసింది. వచ్చే ఏడాది మార్చి నాటి కల్లా ఈ డీల్ పూర్తవుతుందని సెంబ్‌కార్ప్ ప్రకటించింది. ఇందుకు అవసరమైన నిధులను అంతర్గత వనరులు, రుణాల ద్వారా సమీకరించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వెక్టర్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ నిర్వహణలో 495 మెగావాట్ల సోలార్, 24 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులు నడుస్తున్నాయి. మరో 64 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి.