For Money

Business News

లివ‌ర్‌పూల్ ఫుట్‌బాల్‌ టీమ్‌పై ముకేశ్‌ కన్ను

ఇంగ్లిష్ ఫుట్‌బాల్ క్లబ్ `లివ‌ర్‌పూల్ ఎఫ్‌సీ`ని కొనుగోలు చేసేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ ఆసక్తితో ఉన్నారు. ప్రస్తుతం లివ‌ర్‌పూల్ ఎఫ్సీ ఫ్రాంచైజీని ఫెన్‌వే స్పోర్ట్స్ గ్రూప్ (ఎఫ్ఎస్జీ) నిర్వహిస్తోంది. 2010 అక్టోబ‌ర్‌లో లివ‌ర్‌పూల్ ఎఫ్సీని ఫెన్‌వే స్పోర్ట్స్ కొనుగోలు చేసింది. లివ‌ర్‌పూల్ ఎఫ్సీ అమ్మకానికి సంబంధించిన వ్యవహారాలను చూసేందుకు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫైనాన్సియ‌ల్ స‌ర్వీసెస్ సంస్థలు గోల్డ్‌మాన్ సాచెస్‌, మోర్గాన్ స్టాన్‌లీల‌ను ఫెన్‌వే స్పోర్ట్స్ గ్రూప్ ఎఫ్సీ నియమించింది.`ది మిర్రర్‌` పత్రిక క‌థ‌నం ప్రకారం ఫెన్‌వే స్పోర్ట్స్ గ్రూప్ (ఎఫ్ఎస్‌జీ).. 400 కోట్ల బ్రిటిష్ పౌండ్లకు విక్రయించే అవకాశముంది. ప్రస్తుతం ఐపీఎల్ ముంబై ఫ్రాంచైసీ ముకేష్‌అంబానీ చేతిలో ఉంది. ఇంకా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడ‌రేష‌న్‌తో క‌లిసి ఇండియ‌న్ సూప‌ర్ లీగ్ (ఐఎస్ఎల్‌) కూడా నిర్వహిస్తోంది.