ఫెడ్ దెబ్బకు బిట్‌కాయిన్ విలవిల
గడువుకన్నా ముందే వడ్డీ రేట్లను పెంచుతామని, ఉద్దీపన ప్యాకేజీ మద్దతు ఉపసంహరిస్తామని అమెరికా ఫెడరల్ రిజర్వ్ మినిట్స్‌లో వెల్లడైనప్పటి నుంచి క్రిప్టో కరెన్సీల పతనం ఎక్కువైంది. డాలర్‌తో పాటు బాండ్ ఈల్డ్స్ పెరగడంతో జనం క్రిప్టోలో పాక్షికంగా పెట్టుబడులు ఉపసంహరిస్తున్నారు. కేవలం ఒక నెలలోనే 53,000 డాలర్ల నుంచి 42,000 డాలర్లకు బిట్‌కాయిన్ విలువ పడింది. ముఖ్యంగా ఈవారం ఆరంభంలో బిట్‌కాయిన్ 47,000 డాలర్ల వద్ద ట్రేడేంది. వారాంతానికి మరో 5,000 డాలర్లు తగ్గింది. కజక్‌లో అస్థిరపరిస్థితి వల్ల కూడా క్రిప్టో కరెన్సీ నెట్‌వర్క్‌పై అనుమానాలు ఎక్కువౌతున్నాయి. బిట్ కాయిన్ పతనానికి చాలా కారణాలు ఉన్నాయని… అయితే ఫెడ్ నిర్ణయం ప్రధానమైందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. మరో ముఖ్య కారణం కజకిస్తాన్‌లో అశాంతి. బిట్ కాయిన్స్ మైనింగ్ అత్యధికంగా జరిగే దేశాల్లో కజకిస్తాన్ ఒకటి. ఆదేశంలో పెట్రోల్ ధరలను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ మొదలైన ప్రజా పోరాటం ఇపుడు ఇతర అంశాలకు మళ్ళింది. అక్కడ సుస్థిరత ఏర్పడే వరకు క్రిప్టో కరెన్సీపై అనిశ్చితి కొనసాగే అవకాశముంది.