For Money

Business News

NIFTY LEVELS: అమ్మండి

అధిక స్థాయిలో నిఫ్టిని అమ్మమని సలహా ఇస్తున్నారు ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ అశ్వని గుజ్రాల్‌ అంటున్నారు. నిఫ్టి 18000పైన ప్రారంభమైతే.. 18016 నుంచి పైకి వెళితే అమ్మడానికి మంచి ఛాన్స్‌గా భావించాలని అంటున్నన్నారు. నవంబర్3వ తేదీ ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్‌ ఉన్నందున … పై స్థాయలో మద్దతు లభించడం కష్టమని అనలిస్టులు భావిస్తున్నారు. ఇప్పటికే నిఫ్టి కొనుగోలు చేసినవారు ఇవాళ గ్యాప్‌ అప్‌లో అమ్మవచ్చని.. కనీసం పాక్షికంగానైనా అమ్మడం మంచిదని అంటున్నారు. మెజారిటీ అనలిస్టులు మాత్రం అధిక స్థాయిలో నిఫ్టిని అమ్మమని సలహా ఇస్తున్నారు. నిఫ్టి కొననివారు నిఫ్టి డిప్‌ కోసంవెయిట్‌ చేమయని సలహా ఇస్తున్నారు. 17850 వరకు నిఫ్టి పడే అవకాశముందని వీరు అంచనా వేస్తున్నారు. తొందర పడి మాత్రం కొనుగోలు చేయొద్దని అంటున్నారు. నిఫ్టికి అధిక కాల్‌రైటింగ్‌ 18000 వద్ద ఉండటమే దీనికి కారణం.అలాగే పుట్‌ రైటింగ్‌ 17700 ప్రాంతంలో ఉంది. సో.. అధిక స్థాయిలో నిఫ్టిని కొనుగోలు చేయొద్దని…17850 ప్రాంతానికి వచ్చినపుడు కొనుగోలు చేయొచ్చని అంటున్నారు.