For Money

Business News

4 రోజుల్లో వంద శాతం లాభం

ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌కు చెందినరాజ్‌ దీపక్‌ సింగ్‌ ఇవాళ ఓ ఆప్షన్స్‌ వ్యూహాన్ని ఇన్వెస్టర్లకు సిఫారసు చేశారు. ఎకనామిక్‌ టైమ్స్‌ పాఠకుల కోసం ఆయన ఇచ్చిన ఆప్షన్స్‌ వ్యూహం ఏమిటంటే… వీక్లీ పుట్స్‌ అమ్మండి. వచ్చే గురువారం జులై 21వ తేదీన వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజ్‌ కానున్నాయి. ఈ నేపథ్యంలో నిఫ్టి 21 జులై 15900 పుట్‌ను అమ్మండంతో పాటు 14జులై 15600 పుట్‌ను కొనుగోలు చేయమని సలహా ఇచ్చారు. అంటే నికరంగా ప్రీమియం రూ. 45 అవుతుంది. అంటే నికర పెట్టుబడి ఒక లాట్‌కు రూ. 2250. స్టాప్‌లాస్ రూ. 65. అంటే రూ. 3250 దాటితే నష్టంతో బయటకు వచ్చేయండి. దీనివల్ల ఒక లాట్‌కు రూ. 1000 నష్టం వస్తుంది. కాని గురువారం రోజు ఈ రెండు పుట్స్‌ కాంట్రాక్ట్‌ ఒక రూపాయికి చేరుతుందని రాజ్‌ దీపక్‌ సింగ్‌ అంటున్నారు. అంటే రూ. 45కు అమ్మి రూ. 1 వద్ద కొనుగోలు చేయండి. అంటే రూ. 45లపై రూ. 44 లాభం అన్నమాట. గత వారం అమెరికా మార్కెట్ల నుంచి ప్రతికూల వార్తలు వచ్చినా నిఫ్టి 15900 స్థాయిని కాపాడుకోవడంతో పాటు 16000 స్ట్రయిక్‌ వద్ద అట్‌ ద మనీ పుట్‌ రైటింగ్‌ భారీగా ఉందని దీపక్‌ అంటున్నారు. అంటే నిఫ్టి 15900 సపోర్ట్‌తో నిఫ్టి 16500స్థాయిని చేరే అవకాశముందని ఆయన అంటున్నారు. 15900 దిగువకు నిఫ్టి క్లోజైతేనే… పరిస్థితి మారుతుందని.. 15600 దిశగా నిఫ్టి పయనిస్తుందని ఆయన అన్నారు. సో… స్టాప్‌లాస్‌ను పాటిస్తూ ఈ వ్యూహాన్ని అమలు చేయండి.