For Money

Business News

ఇక మూడు రోజులకే IPO లిస్టింగ్‌

స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ బోర్డు ఇవాళ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా పబ్లిక్‌ ఆఫర్ల లిస్టింగ్‌కు సంబంధించి కీలక నిర్ణయానికి ఆమోదం తెలిపింది. పబ్లిక్‌ ఆఫర్‌ లిస్టింగ్‌ సమయం ఇపుడు ఆరు రోజులు ఉండగా, దీన్ని మూడు రోజులకు తగ్గింది. పబ్లిక్‌ ఇష్యూ ఆఫర్‌ ముగిసిన తేదీ తరవాత ఆరు రోజులకు ఇపుడు షేర్లు లిస్ట్‌ అవుతున్నాయి. దీన్ని మూడు రోజులకు తగ్గించింది. అయితే కొత్త నిబంధనను కంపెనీలు సెప్టెంబర్‌ 1 నుంచి ఐచ్ఛికంగా అమలు చేయొచ్చు. అంటే ఇష్టముంటే మూడు రోజులకు లేదా ఆరు రోజులకు లిస్ట్‌ చేయొచ్చు. అయితే డీసెంబర్‌ 1వ తేదీ నుంచి మాత్రం కచ్చితంగా మూడు రోజులకే లిస్ట్‌ చేయాల్సి ఉంటుంది. అలాగే మ్యూచువల్‌ ఫండ్ల బిజినెస్‌కు, ఖర్చులకు ముడిపెట్టడానికి సంబంధించిన ప్రతిపాదనలపై సెబీ బోర్డు నిర్ణయం తీసుకోలేదు. దీన్ని వాయిదా వేసింది.