IPO: కనిష్ఠ, గరిష్ఠ రేట్ల మధ్య 5 శాతం వ్యత్యాసం?
పబ్లిక్ ఇష్యూల విషయంలో షేర్ ధర శ్రేణి నిర్ణయించే సమయంలో కనిష్ఠ, గరిష్ఠ ధరల మధ్య వ్యత్యాసం కనీసం 5 శాతం క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఉండాలనిప్రతిపాదించింది. అలాగే నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (ఎన్ఐఐలు)లను సబ్ కేటగిరీలోకి చేర్చే యోచనలో ఉన్నట్లు సెబి పేర్కొంది. ఈ అంశాలతోపాటు బుక్ బిల్డింగ్ మార్గదర్శకాలపై ప్రతిపాదనలు చేసింది. వీటిపై ప్రజల అభిప్రాయాలను ఆహ్వానించింది. 2021 అక్టోబర్ 20కల్లా వీటిని దాఖలు చేయొచ్చు. ఇటీవల పలు కంపెనీలు ఐపీవోల ధరల శ్రేణిలో కనిష్ట, గరిష్టాలను అతితక్కువగా ఉన్నాయని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో సెబీ తాజా ప్రతిపాదనలు తీసుకువచ్చింది. ధరల నిర్ణయంలో పారదర్శక, నిజాయితీ లోపిస్తున్నట్లు సెబీ పేర్కొంది. దీంతో బుక్ బిల్ట్ విధానంలో ప్రైస్బ్యాండ్ వ్యత్యాసం కనీసం 5 శాతం ఉండేలా ప్రతిపాదించింది.