For Money

Business News

సెబికి మరిన్ని విస్తృత అధికారాలు ఇవ్వాలి

అమెరికా చెందిన షార్ట్‌ సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ నివేదిక వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. ఈ నివేదిక కారణంగా ఇన్వెస్టర్లు లక్షలు కోట్ల రూపాయలు నష్టపోయారని… దీనికి కారణమైన హిండెన్‌బర్గ్‌పై చర్యలు తీసుకోవాలంటే లాయర్‌ ఎంఎల్‌ శర్శ వేసిన పిటీషన్‌పై ఇవాళ కోర్టులో విచారణ జరిగింది. దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు షేర్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబి)కి నోటీసు జారీ చేసింది. ఇలాంటి సంక్షభ సమయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని ఆదేశించింది. సెబి సామర్థ్యంపై తాము ఎలాంటి కామెంట్లు చేయడం లేదని… అయితే సెబి మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు వీలుగా… ఆ సంస్థ మరిన్ని అధికారులు ఇవ్వాల్సి ఉందని కోర్టు అభిప్రాయపడింది. దీనికి సంబంధించి ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్‌ ఈ సూచన చేసింది. ఇదే అంశంపై మరో లాయర్‌ విశాల్ తివారీ వేసిన పిటీషన్‌ను కూడా కోర్టు విచారించింది. ఒక కంపెనీకి రూ. 500 కోట్లకు మించి రుణాలు ఇచ్చే అంశంలపై విధానపరమైన అంశాలు చూసేందుకు ఒక కమిటీ ఉండేలా కోర్టు ఆదేశాలు ఇవ్వాలని తివారీ కోరారు.