For Money

Business News

కోలుకున్నా నష్టాల్లోనే నిఫ్టి

ఇవాళ మార్కెట్‌ తీవ్ర స్థాయిలో హెచ్చుతగ్గులకు లోనైంది. ఉదయం 17801ని తాకిన నిఫ్టి తరవాత కోలుకుంది. మిడ్‌ సెషన్‌కు ముందు 17,876ని తాకింది. అయితే యూరో మార్కెట్లు కూడా భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. యూరోస్టాక్స్‌ 50 సూచీ 1.24 శాతం క్షీణించింది. దీంతో మన మార్కెట్లు కూడా నష్టాల్లోకి జారుకున్నాయి. మిడ్‌ సెషన్‌ తరవాత కూడా నిఫ్టి భారీ హెచ్చుతగ్గులకు లోనైంది. నిఫ్టి మిడ్‌ క్యాప్‌ గ్రీన్‌లో క్లోజ్‌ కాగా, నిఫ్టి బ్యాంక్‌లో పెద్ద మార్పులు లేవు. నిఫ్టిలో ఇవాళ 3.78 శాతం నష్టంతో క్లోజ్‌ కాగా, అదానీ పోర్ట్స్‌ స్థిరంగా ముగిసింది. నిన్న భారీగా పెరిగిన పేటీఎం ఇవాళ 8 శాతం లాభంతో ముగిసింది. అదానీ గ్రూప్‌లోని అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ టోటల్‌, అదానీ గ్రీన్‌ షేర్లు ఇవాళ కూడా అయిదు శాతం లోయర్‌ సీలింగ్‌తో ముగిశాయి. ఏసీసీ కూడా నష్టాల్లో క్లోజ్‌ కాగా, అంబుజా సిమెంట్‌ నష్టాల్లో ముగిసింది. నిఫ్టిలో టాటా మోటార్స్‌, యూపీఎల్‌, సిప్లా షేర్లు టాప్‌లో ఉన్నాయి