For Money

Business News

నష్టాల్లో ప్రారంభమైన నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టితో పోలిస్తే నిఫ్టి కాస్త నిలకడగా ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 17825ని తాకినా వెంటనే తేరుకుని 17860 ప్రాంతంలో కదలాడుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే ప్రస్తుతం 33 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టిలో 30 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టి బ్యాంక్‌ స్థిరంగా ఉన్నా నిఫ్టి మిడ్‌క్యాప్‌, నిఫ్టి నెక్ట్స్‌ సూచీలు రెడ్‌లో కొనసాగుతున్నాయి. అదానీ గ్రూప్‌ షేర్లలో ఒత్తిడి కొనసాగుతోంది. అదానీ ఎంటర్‌ ప్రైజస్‌ ఇవాళ రెండు శాతంపైగా నష్టంతో ట్రేడవుతోంద. అదానీ పోర్ట్స్‌ మాత్రం స్థిరంగా ఉండటం విశేషం. అయితే అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ టోటల్‌, అదానీ గ్రీన్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నిన్న, మొన్న భారీగా లాభపడిన పేటీఎం ఇవాళ నాలుగున్నర శాతం నష్టంతో ట్రేడవుతోంది. జొమాటో కూడా మూడు శాతం తగ్గింది. నైకా మాత్రం రెండు శాతం లాభపడింది. చాలా రోజుల తరవాత ఎల్‌ఐసీ రెండున్నర శాతం లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టి బ్యాంక్‌ ఆరంభంలో నష్టాల్లో ఉన్నా… వెంటనే తేరుకుంది.