For Money

Business News

IMPS స్లాబ్‌ పెంచిన ఎస్‌బీఐ

ఐఎంపీఎస్‌ (ఇమిడియెట్‌ పేమెంట్‌ సర్వీస్‌) లావాదేవీ గరిష్ఠ పరిమితిని రూ.5 లక్షలకు ఎస్‌బీఐ పెంచింది. ఆర్‌బీఐ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్‌ తెలిపింది. గతంలో ఈ పరిమితి గరిష్ఠంగా రూ.2 లక్షలుగా ఉండేది. పెంచిన పరిమితిపై కొత్త స్లాబ్‌ను ఏర్పాటు చేసి.. ఆ మేరకు ఎస్‌బీఐ చార్జి వసూలు చేస్తుంది. రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ప్రతి లావాదేవీకి రూ.20+ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని ఎస్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం రూ. 1000 వరకు ఎలాంటి ఛార్జీలు లేవు. వెయ్యి నుంచి రూ.10 వేల వరకు రూ.2+జీఎస్టీ
రూ.10వేలు నుంచి రూ.లక్ష వరకు రూ.4+ జీఎస్టీ
లక్ష రూపాయల నుంచి రూ.2 లక్షల వరకు రూ.12+ జీఎస్టీ
రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రూ.20+ జీఎస్టీ