ఇంటి రుణాలపై ఎస్బీఐ స్పెషల్ ఆఫర్
ఎస్బీఐ పండగ సీజన్ ఆఫర్ ప్రకటించింది. రుణ మొత్తంతో సంబంధం లేకుండా అన్ని రకాల ఇంటి రుణాలను 6.7శాతం వడ్డీకే ఇవ్వనున్నట్లు ఎస్బీఐ వెల్లడించింది. అయితే క్రెడిట్ స్కోరు ఆధారంగా ఈ ఆఫర్ వర్తింపజేస్తారు. పైగా ఈ ఆఫర్ కింద తీసుకునే రుణాపలై ప్రాసెసింగ్ ఫీజును కూడా ఉండదని తెలిపింది. రూ.75లక్షల కంటే ఎక్కువ మొత్తంలో గృహరుణం తీసుకునేవారికి కూడా 7.15శాతం వడ్డీరేటు వసూలు చేసేది. పండగ ఆఫర్‌తో కొత్తగా గృహరుణం తీసుకునేవారికి.. ఎంత మొత్తం రుణానికైనా వడ్డీ 6.70 శాతమేనని పేర్కొంది. అయితే ఈ పండగ సీజన్ ఎప్పటివరకు అన్నది బ్యాంకు స్పష్టంగా చెప్పలేదు.