For Money

Business News

నిఫ్టికి ఇవాళ కూడా బూస్ట్‌!

ప్రపంచ మార్కెట్లది ఒకదారి. మన మార్కెట్లది ఒకదారి. డాలర్‌కు పోటీ క్రూడ్‌ ఆయిల్ పెరుగుతున్నా… మన మార్కెట్‌లో బుల్‌ రన్‌ ఆగడం లేదు. నిన్న యూరో మార్కెట్లు ఒక మోస్తరు లాభాలతో ముగిశాయి. కాని అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. రీటైల్‌ సేల్స్‌ గణాంకాలు బాగుండటంతో రాత్రి డాలర్‌ అనూహ్యంగా పెరిగింది. డాలర్‌ ఇండెక్స్‌ 93కి దగ్గరగా ఉంది. అంటే ఫెడరల్‌ రిజర్వ్ ఉద్దీపన ప్యాకేజీకి ఫుల్‌ స్టాప్‌ పెట్టనుంది. దీంతో అమెరికా మార్కెట్లు నామమాత్రపు మార్పులతో ముగిశాయి. ఇక ఆసియా మార్కెట్లు ఉదయం నుంచి గ్రీన్‌లో ఉన్నాయి. గత కొన్ని రోజులుగా భారీగా నష్టపోతున్న ఆసియా మార్కెట్లలో స్వల్ప రిలీఫ్‌ కన్పిస్తోంది. సింగపూర్ నిఫ్టి దాదాపు వంద పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. విదేశీ ఇన్వెస్టర్లు భారీగా కొనుగోలు చేస్తున్నారు. నిన్న ఒక్క రోజే రూ. 1622 కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు. అయిదు రోజుల్లో రూ. 5,400 కోట్లు ఇన్వెస్ట్‌ చేశారు. సో.. నిఫ్టి ఇవాళ కూడా గ్రీన్‌లో ప్రారంభం కానుంది.