For Money

Business News

ఆగస్టు 15 కానుక… వడ్డీ రేట్ల పెంపు

రుణాలపై తాను విధించే పన్నును ఎస్‌బీఐ ఇవాళ పెంచింది. అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లను 0.2 శాతం పెంచుతున్నామని, ఇవాళ్టి నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని ఎస్బీఐ పేర్కొంది. దీంతో మూడు నెలల MCLR 7.35 శాతనికి, మూడేళ్ళు దాటిని రుణాపలై MCLR 8 శాతానికి చేరినట్లు బ్యాంక్‌ పేర్కొంది. అలాగే EBLR (external benchmark-based lending rate) ను కూడా అర శాతం పెంచినట్లు పేర్కొంది. ఏప్రిల్‌ నుంచి ఎస్‌బీఐ ఇప్పటి వరకు వడ్డీ రేట్లను మూడు సార్లు పెంచింది. ఏప్రిల్‌ నుంచి ఆర్బీఐ రెపో రేటును 1.4 శాతం పెంచిన విషయం తెలిసిందే. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంకులు కూడా ఎంసీఎల్‌ఆర్‌ను ఈ మధ్యే పెంచాయి.