For Money

Business News

81ని క్రాస్‌ చేసిన రూపాయి

విదేశీ మారక ద్రవ్య మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి మరింత బలహీనపడి 81 దిగువకు పడిపోయింది. ఇవాళ ఓపెనింగ్‌లోనే రూపాయి విలువ 81.09కి పడిపోయింది. నిన్నటితో పోలిస్తే రూపాయి 26 పైసలు బలహీనపడింది. గత వారం 78.50 రూపాయిలకు ఒక డాలర్‌ లభించగా, ఇవాళ 81.09 రూపాయలకు ఒక డాలర్‌ లభిస్తోంది. రాత్రి కూడా అంతర్జాతీయ మార్కెట్‌లోడాలర్‌ బలపడింది. డాలర్‌ ఇండెక్స్‌ 111ని క్రాస్‌ చేసింది. ఇదే సమయంలో రాత్రి క్రూడ్‌ ధరలు కూడా పెరగడంతో రూపాయిపై ఒత్తిడి పెరిగింది.