For Money

Business News

కొత్త ఆల్‌టైమ్‌ కనిష్ఠ స్థాయికి రూపాయి

ఇంటర్‌ బ్యాంక్‌ విదేశీ మారక ద్రవ్య మార్కెట్‌ (ఫారెక్స్‌ మార్కెట్‌)లో డాలర్‌తో రూపాయి మారకం విలువ ఇవాళ మరింతగా క్షీణిచింది. ఒకేరోజు 27 పైసుల తగ్గింది. ఇవాళ ఉదయం ఒక డాలర్ కు రూ.78.13 పైసలు పలికిన రూపాయి రూ.78.40 పైసల వద్ద ముగిసింది. అంటే ఉదయం 78.13కే ఒక డాలర్‌ రాగా, సాయంత్రానికి 78.40 ఇస్తేగాని డాలర్‌ దొరకలేదన్నమాట. విదేశీ పెట్టుబడిదారులు మన ఈక్విటీ మార్కెట్‌ నుంచి భారీగా నిధులు వెనక్కి తీసుకెళ్ళడం, కొత్త ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టకపోవడంతో డాలర్లకు డిమాండ్ పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా రూపాయికి అండగా ఉన్న ఆర్బీఐ ఇవాళ రూపాయి పతనం కోసం ఆగింది. ఒక్క జూన్ నెలలోనే ఇప్పటివరకు రూ. 38,500 కోట్ల మేర సొమ్మును విదేశీ ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నట్టు రిజర్వు బ్యాంకు గణాంకాలు చెబుతున్నాయి. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌ విలువతో పాటు క్రూడ్‌ ఆయిల్ ధరలు కూడా పెరగడంతో ఆర్బీఐ తన వద్ద డాలర్ నిల్వలను మార్కెట్లోకి వొదలాల్సి వచ్చింది. నిజానికి గత రెండు రోజుల నుంచి క్రూడ్‌ ధరలు తగ్గాయని, లేకుంటే రూపాయి మరింత పడేదని ఫారెక్స్‌ ట్రేడర్లు అంటున్నారు.