For Money

Business News

పతనంలో రూపాయి మరో రికార్డు

అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌ బలపడుతోంది. మన దేశంలో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల కారణంగా డాలర్‌కు డిమాండ్ పెరుగుతోంది. అలాగే క్రూడ్‌ ఆయిల్ ధరలు 100 డాలర్లపైనే ఉండటంతో డాలర్‌ డిమాండ్‌తో రూపాయి కొత్త కనిష్ఠ స్థాయిలను తాకుతోంది. ఇవాళ ఉదయం ఇంటర్‌ బ్యాంక్‌ విదేశీ మారక ద్రవ్య మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి విలువ 77.56కు చేరగా… ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో మే కాంట్రాక్ట్‌ 77.76కు చేరింది. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతున్న కారణంగా… వడ్డీ రేట్లు పెరగనున్నాయి. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్‌లో భారీ అమ్మకాలకు పాల్పడుతున్నారు. దీంతో డాలర్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. వచ్చే నెలలో ఆర్బీఐ కూడా వడ్డీ రేట్లను ఇంకా పెంచుతుందని వార్తలు వస్తున్నాయి. దీంతో ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల జోరు పెరుగుతోంది.