ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయికి రూపాయి
విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో డాలర్‌తో రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పెంచడంతో అమెరికా డాలర్ 20 గరిష్ఠానికి పెరిగింది. దీంతో ఇవాళ ఓపెనింగ్‌లోనే డాలర్‌తో రూపాయి బక్కచిక్కిపోయింది. ఫార్వర్డ్ మార్కెట్లో డాలర్‌తో రూపాయి విలువ 80.80కి పడిపోయింది. కరెన్సీ మార్కెట్లో డాలర్ బలంతో పాటు ట్రెజరీ బాండ్లపై ఈల్డ్ పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు డాలర్ల కోసం ఎగబడుతున్నారు. చాలా మంది ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఈక్విటీ మార్కెట్ల నుంచి అధిక ప్రతిఫలం ఇచ్చే బాండ్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. మున్ముందు వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉన్నందున.. రూపాయి మరింత బలహీనపడే అవకాశముంది.