చరిత్ర సృష్టించిన రూపాయి
దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా డాలర్‌తో రూపాయి బలహీనపడింది. ఇవాళ విదేశీ మారక ద్రవ్య మార్కెట్ (ఫారెక్స్ మార్కెట్)లో డాలర్‌తో రూపాయి విలువ 83.02కు చేరింది. అంటే ఒక డాలర్ కావాలంటే రూ. 83.02లు ఇవ్వాల్సి ఉంటుంది. అమెరికా డాలర్ స్వల్పంగా పెరిగినా… బాండ్ ఈల్డ్స్ పెరగడంతో డాలర్‌కు డిమాండ్ పెరుగుతోంది. ఈక్విటీ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు తమ అమ్మకాలు జరుపుతూనే ఉన్నారు. తమ దేశంలో బాండ్ ఈల్డ్స్ పెరుగుతుండటంతో చాలా మంది విదేశీ ఇన్వెస్టర్లు ఇక్కడ షేర్లను అమ్మి… తమ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. అంతర్జాతీయంగా మాంద్యం పరిస్థితులు నెలకొనడం ఖాయం కన్పించడంతో పాటు.. భారత ఈక్విటీ మార్కెట్లు ఇప్పటికే బాగా పెరిగాయని… ఇక్కడి నుంచి జోరుగా పెరగడం అసాధ్యమని చాలా మంది విదేశీ ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.