80ని క్రాస్ చేయనున్న రూపాయి
విదేశీ మారక ద్రవ్య మార్కెట్ (ఫారెక్స్ మార్కెట్)లో డాలర్‌తో మన రూపాయి మారకం విలువ చరిత్రాత్మక కనిష్ఠ స్థాయికి పడిపోయింది. నిన్న మార్కెట్లో 79.99 వద్ద క్లోజైంది. ఇవాళ 80 మార్కెట్‌ను క్రాస్ చేసి మరింత బలహీనపడనుంది. నిన్న రాత్రి ఈ కరెన్సీ విదేశీ మార్కెట్లలో 80.22 కనిష్ఠాన్ని తాకింది. నిన్న రూపాయి 18 పైసలు క్షీణించింది. డెరివేటివ్స్ అంటే ఫ్యూచర్స్ మార్కెట్లో డాలర్ రూపాయి (జులై కాంట్రాక్ట్) 80.09 వద్ద క్లోజ్ కాగా, ఆగస్టు కాంట్రాక్ట్ 80.30 వద్ద ముగిసింది. గత నెలరోజుల్లో 78 స్థాయి నుంచి భారీగా 3 శాతం రూపాయి విలువను నష్టపోయింది.ఈ ఏడాది 6.5 శాతం విలువను కోల్పోయింది. అంతర్జాతీయ మార్కెట్లో డాలరు పటిష్ఠంగా ఉండటంతో రూపాయి బలహీనపడిందని, క్రూడ్ ధరలు కొంతమేర దిగిరావడం రూపాయి నష్టాల్ని పరిమితం చేశాయని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. డాలర్ ఇండెక్స్ రికార్డు గరిష్ఠస్థాయి 109 సమీపంలో ట్రేడవుతున్నది. ఆరు ప్రపంచ ప్రధాన కరెన్సీలతో పోల్చి అమెరికా డాలర్ ఇండెక్స్‌ను ఖరారు చేస్తారు. రాత్రి అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 4.5 శాతం మేర క్షీణించి 95 డాలర్ల స్థాయికి తగ్గినా.. క్లోజింగ్ సమయానికి కోలుకుని 99కి చేరింది. ఇపుడు 100 డాలర్లకు చేరింది. దీంతో రూపాయిపై మరింత ఒత్తిడి పెరగనుంది.