For Money

Business News

ఎస్‌ బ్యాంక్‌లో రూ.8000 కోట్ల పెట్టుబడి?

ఎస్‌ బ్యాంక్‌లో రూ.8000 కోట్లు (వంద కోట్ల డాలర్లు) పెట్టుబడి పెట్టేందుకు కార్లిలే, అడ్వెంట్‌ కంపెనీలు ప్రయత్నిస్తున్నారు. ఈక్విటీ ఇన్వెస్టర్లుగా కొనసాగేందుకు వీరు ఆసక్తి చూపుతున్నారు. ఈ మేరకు హాంగ్‌కాంగ్‌ నుంచి ఈ రెండు కంపెనీలు ప్రతినిధులు భారత్‌లో చర్చలు జరుపుతున్నారు. ఎస్‌ బ్యాంక్‌తో పాటు ఈ బ్యాంక్‌లో అత్యధిక వాటా ఉన్న ఎస్‌బీఐతో కూడా కార్లిలే, అడ్వెంట్‌ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. ఆర్‌బీఐ తో కూడా వీరు చర్చలు జరిపినట్లు ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రిక పేర్కొంది. అలాగే తనకున్న నిరర్థక ఆస్తులను జేసీ ఫ్లవర్స్‌కు అమ్మే అంశాన్ని కూడా ఎస్‌ బ్యాంక్‌ పరిశీలిస్తోంది.