For Money

Business News

తెలంగాణ బడ్జెట్‌ రూ. 2.56 లక్షల కోట్లు

2022-23 ఏడాదికి రూ. 2,56,958 కోట్లతో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌ రావు తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇవాళ ఆయన అసెంబ్లీ 2022-23 బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ.. . కేంద్రం నుంచి ఎలాంటి నిధులు రావడం లేదని ఆరోపించారు. కొత్త బడ్జెట్‌లో రూ. 1,89,274 కోట్లు రెవెన్యూ వ్యయంగా మరో రూ. 29,728 కోట్లు క్యాపిటల్‌ వ్యయంగా ఆయన చూపారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయకు రూ. 24000 కోట్లు కేంద్రం ఇవ్వాల్సి ఉన్నా… కనీసం రూ. 24 కోట్లు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. జహీరాబాద్‌లో నిర్మిస్తున్న నిమ్స్‌కు కేంద్రం వాటా కింద రూ. 500 కోట్లు ఇవ్వాల్సి ఉన్నా… ఇంకా ఇవ్వలేదన్నారు.కరోనా సమయంలోనూ కేంద్రం అదనంగా ఇవ్వలేదన్నారు. కేంద్ర విధానాల వల్ల ఏటా రూ. 5000 కోట్లు అంటే అయిదేళ్ళలోరూ. 25వేల కోట్లు నష్టపోయామన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతుండగా బీజేపీ సభ్యులు పదే పదే అడ్డుపడటంతో బీజేపీ సభ్యులు ఈటెల, రాజాసింగ్‌, రఘునందన్‌ రావులను సభ ముగిసే వరకు సస్పెండ్‌ చేయాలని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ తీర్మానం ప్రవేశపెట్టగా, సభ ఆమోదించింది. తరవాత హరీష్‌ రావు బడ్జెట్‌ ప్రసంగం కొనసాగింది.