For Money

Business News

ఎన్‌ఎస్‌ఈలో సాంకేతిక సమస్యలు

సూచీలు, షేర్లు భారీగా నష్టపోవడంతో టెన్షన్‌లో ఉన్న వేళ ఎన్‌ఎస్‌ఈ నుంచి సాంకేతిక సమస్యలు రావడంతో ఇన్వెస్టర్లలో గందరగోళం నెలకొంది. ఎన్‌ఎస్‌ఈలో 90 శాతం ట్రేడింగ్‌ ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌లో జరుగుతుంది. అందులో ఆప్షన్స్‌లో మరీ ఎక్కువగా ఉంటుంది. మార్కెట్‌ భారీనష్టాలతో ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే ఎన్‌ఎస్‌ఈ నుంచి డేటా అప్‌డేట్‌ కాకపోవడంతో చాలా మంది సిస్టమ్‌లో కన్పించే డేటాను నమ్ముకుని ఆర్డర్లు పెట్టారు. కొన్ని సెకన్లలోనే ఈ పొరపాటు గమనించిన బ్రోకర్లు ఎక్స్ఛేంజీ దృష్టికి తీసుకెళ్ళారు. వెంటనే ఇన్వెస్టర్లకు కూడా ఆర్డర్లు పెట్టే ముందు ఆర్డర్‌ టైమ్‌ స్క్రీన్‌పై చూసి తాజా టైమ్‌ ఉంటేనే ట్రేడ్‌ చేయమని సలహా ఇచ్చారు. ప్రముఖ స్టాక్‌ బ్రోకింగ్ సంస్థ జోరాద ఇన్వెస్టర్లకు మెసేజ్‌ పెట్టింది. ఆ తరవాత 30 నిమిషాలకు ఎక్స్ఛేంజీ నుంచి డేటా అప్‌డేట్‌ అవుతోందని మెసేజ్‌ పెట్టింది. అంటే అర గంటపాటు డేటా అప్‌డేట్‌ అవలేదన్నమాట.అలాగే ఐసీఐసీఐ డైరెక్ట్‌ కూడా ఇన్వెస్టర్లకు హెచ్చరించింది. 10.31కు ఎన్‌ఎస్‌ఈ ట్వీట్‌ చేస్తూ అన్ని సిగ్మెంట్స్‌ బాగానే పనిచేస్తున్నాయని పేర్కొంది. అయితే నిఫ్టి, బ్యాంక్‌ నిఫ్టి సూచీలు మాత్రం ఆగి ఆగి అప్‌ డేట్‌ అవుతున్నాయని… ఆ సమస్యను పరిష్కరించేందుకు తమ సిబ్బంది ప్రయత్నిస్తున్న పేర్కొంది.