For Money

Business News

స్వల్పంగా తగ్గిన రిటైల్‌ ద్రవ్యోల్బణం

ఆహార పదార్థాల ధరలు తగ్గడంతో ఆగస్టులో వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.3 శాతానికి తగ్గిందని నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆర్గనైజేషన్‌ (ఎన్‌ఎస్‌ఓ) వెల్లడించింది. జులైలో ఇది 5.59 శాతం కాగా గత నెలలో స్వల్పంగా తగ్గింది. అదే గత ఏడాది ఆగస్టులో రీటైల్‌ ద్రవ్యోల్బణం 6.69 శాతంగా ఉండేది. ఈ ఏడాది ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం జులైలో 3.96 శాతం కాగా, ఆగస్టులో 3.11 శాతానికి తగ్గింది. 2021-22 మొత్తంమీద సీపీఐ ద్రవ్యోల్బణం 5.7 శాతంగా ఉండొచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది. రెండో త్రైమాసికంలో 5.9%, మూడో త్రైమాసికంలో 5.3%, నాలుగో త్రైమాసికంలో 5.8 శాతం నమోదు కావొచ్చని పేర్కొంది.
కూరగాయలు, తృణధాన్యాలు-ఉత్పత్తుల ద్రవ్యోల్బణం వరుసగా 11.68%, 1.42% మేర క్షీణించడంతో మొత్తం ద్రవ్యోల్బణం తగ్గింది.