రీటైల్ ద్రవ్యోల్బణం తగ్గింది
ఆహార పదర్థాల ధరలు స్వల్పంగా తగ్గడంతో రీటైల్ ద్రవ్యోల్బణం జులైలో 5.59 శాతానికి తగ్గింది. జూన్లో ఈ ద్రవ్యోల్బణం 6.26 శాతంగా నమోదైన విషయం తెలిసిందే. తాజా వివరాలను నేషనల్ స్టాటిస్టిక్స్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. .జూన్లో 5.15 ఉన్న ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం జులైలో 3.96 శాతానికి తగ్గిందని ఎన్ఎస్ఓ వెల్లడించింది. మరోవైపు జూన్ నెలలో పారిశ్రామిక ఉత్పత్తి 13.6 శాతంగా నమోదైంది. గత ఏడాది ఈ గణాంకాలు మరీ దారుణంగా ఉండటంతో… వాటితో పోల్చడం వల్ల ఈ సారి బాగా పెరిగినట్లు కన్పిస్తోంది. ఫ్యాక్టరీ ఉత్పత్తి గత జూన్లో మైనస్ 16.6 శాతం నమోదైంది.