For Money

Business News

నవంబర్‌లో ఆల్‌ న్యూ పల్సర్‌

ఈ ఏడాది నవంబర్‌కు బజాజ్‌ ఆటో ఉత్పత్తుల్లో రారాజైన ‘పల్సర్‌’కు 20 ఏళ్ళు అవుతుంది. ఈ సందర్భంగా వచ్చే నవంబర్‌లో ఆల్‌ న్యూ పల్సర్‌ ప్లాట్‌ఫామ్‌ను మార్కెట్‌లోకి భారీ ఎత్తున విడుదల చేయనున్నట్లు బజాజ్‌ ఆటో మేనేజింగ్ డైరెక్టర్‌ రాజీవ్‌ బజాజ్‌ వెల్లడించారు. పూర్తి కొత్త ఫీచర్స్‌తో వస్తున్న ఈ బైక్‌ ధర మాత్రం దాదాపు ఇపుడు మార్కెట్‌ ధరల్లోనే అందుబాటులోకి వచ్చేలా చూస్తున్నామన్నారు. ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ తయారీ కోసం కొత్త అనుబంధ సంస్థను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం తాము తయారు చేస్తున్న చేతక్‌ పుణె, బెంగళూరు, నాగ్‌పూర్‌లలో మాత్రమే మార్కెట్‌ చేస్తున్నామని… డిమాండ్‌ అధికంగా ఉండటంతో ఉత్పత్తి సామర్థ్యం పెంచుతున్నామని రాజీవ్‌ బజాజ్‌ వెల్లడించారు. త్వరలోనే 25 డీలర్ల వద్ద ఈ వాహనం అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు.

file photo