For Money

Business News

మిగిలిన మ్యాచ్‌లు దక్షిణాదిలో…

ఐపీల్‌లో మిగిలిన మ్యాచ్‌లన్నీ దక్షిణాదిలో నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. భారత్‌, పాక్‌ మధ్య కాల్పుల విరమణ కుదరడంతో వాయిదా వేసిన మ్యాచ్‌లను వచ్చే వారం నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ మేరకు విదేశీ ప్లేయర్లను రప్పించాల్సిందిగా ఇప్పటికే ఫ్రాంచైజీలకు సమాచారం ఇచ్చింది. ప్రస్తుత సీజన్‌లో ఇంకా 16 మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నాయి. వీటిని బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈనెల 25వ తేదీన కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో ఫైనల్స్‌ నిర్వహించాల్సి ఉంది. ఈ వేదికను కూడా మార్చే ఆలోచనలో బీసీసీఐ ఉంది. పరిస్థితిని బట్టి చివరి నిమిషంలో నిర్ణయం తీసుకునే ఉంది.