For Money

Business News

రిలయన్స్ చేతికి గూగుల్‌ అనుబంధ కంపెనీ?

గూగుల్‌కు చెందిన ఓ అనుబంధ సంస్థను కొనుగోలు చేసేందుకు రిలయన్స్‌ గ్రూప్‌ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు Glance InMobi Pte సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ఇది మొబైల్ కంటెంట్ ప్రొవైడర్ కంపెనీ. ఇందులో రిలయన్స్ కీలక వాటా తీసుకునేందుకు చర్చలు జరుపుతోంది. ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ 30 కోట్ల డాలర్లను వెచ్చించనుంది. త్వరలోనే ఈ డీల్ కుదిరే అవకాశం ఉంది. Glance InMobi Pte కంపెనీ క్యూరేటెడ్ కంటెంట్, న్యూస్, ఎంటర్టైన్మెంట్, ఫోన్ లాక్ స్క్రీన్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తుంది. దీన్ని రాపొసొ యాప్‌ ద్వారా అందిస్తోంది. త్వరలో రిలయన్స్, గూగుల్ కలిసి ఉత్పత్తి చేస్తున్న బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కోసం ఈ సంస్థను సొంతం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.