జియో ఎయిర్ ఫైబర్‌ను ప్రకటించిన రిలయన్స్
రిలయన్స్ జియో నుంచి జియో ఎయిర్ ఫైబర్‌ను ప్రారంభిస్తున్నట్లు జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాష్ ఎం అంబానీ వెల్లడించారు. ఇవాళ ముంబైలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 45వ ఏజీఎం జరుగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జియో ట్రూ 5జీ ని జియో ఎయిర్ ఫైబర్ పేరుతో ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గిగాబైట్ స్పీడ్‌తో ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందిస్తామని ఆయన అన్నారు. వైర్లెస్, సింపుల్, సింగిల్ డివైజ్ సొల్యూషన్‌గా జియో ఎయిర్ ఫైబర్ పనిచేస్తుందని అన్నారు. ఎక్కడా వైర్లతో సంబంధం లేకుండా ఈ సర్వీస్ అందిస్తామని అన్నారు. ఒకే సారి మల్టిపుల్ వీడియో స్ట్రీమ్స్‌ను ప్రసారం చేయొచ్చని ఆయన అన్నారు. జియో క్లౌడ్ పీసీని కూడా అందిస్తామని అన్నారు. దీనికి ముందుగా భారీ పెట్టుబడి పెట్టాల్సిన పనిలేదని… అప్ గ్రేడ్స్ కూడా అక్కర్లేదని అన్నారు. జియో 5జీ ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను ముంబైలో నెలకొల్పుతామని అన్నారు.