రిలయన్స్ నికర లాభం రూ.18,549 కోట్లు
డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నికర లాభం మార్కెట్ అంచనాలను మించింది. టర్నోవర్ మాత్రం తగ్గడం విశేషం. సీఎన్‌బీటీవీ 18 నిర్వహించిన పోల్ ప్రకారం కంపెనీ రూ. 15,660 కోట్ల నికర లాభం ఆర్జిస్తుందని అనుకున్నారు. అయితే కంపెనీ రికార్డు స్థాయిలో రూ.18,549 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కంపెనీ టర్నోవర్ రూ. 1.93 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేయగా, రూ. 1.85 లక్షల కోట్లకు పరిమితమైంది. కంపెనీ మార్జిన్ 14.8 శాతం ఉంటుందని అంచనా వేయగా 16.05 శాతానికి పెరిగింది.
గత ఏడాదితో పోలిస్తే…
గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం 42 శాతం పెరగ్గా, ఆదాయం 62 శాతం పెరిగింది. రిలయన్స్ రీటైల్, రిలయన్స్ జియో విభాగాలు అద్భుతంగా రాణించడంతో ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి. రెండో త్రైమాసికంతో పోలిస్తే కూడా అన్ని విభాగాల్లో కంపెనీ వద్ధి కనబర్చింది. మార్జిన్స్ కూడా 15.5 శాతం నుంచి 16.05 శాతానికి పెరిగింది.